Mahesh Babu: ఆడియో ఫంక్షన్ దిశగా 'భరత్ అనే నేను' .. వేదికగా ప్రత్యేకమైన సెట్!

  • షూటింగు దశలో 'భరత్ అనే నేను'
  • త్వరలో చివరి షెడ్యూల్ షూటింగ్ 
  • వెరైటీగా ఆడియో ఫంక్షన్  
కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' రూపొందుతోంది. త్వరలోనే ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగును మొదలుపెట్టనుంది. ఏప్రిల్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే పోస్టర్స్ కి .. టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, ఆడియో వేడుకతో మరింతగా అంచనాలు పెంచడానికి సన్నాహాలు చేస్తున్నారు.

వైజాగ్ లో ఈ సినిమా ఆడియో వేడుకను జరపనున్నట్టు సమాచారం. ఈ సినిమా పొలిటికల్ డ్రామా నేపథ్యంలో రూపొందుతుండటం వలన, అసెంబ్లీ తరహాలో స్టేజ్ సెట్ వేయనున్నట్టు చెబుతున్నారు. ఆడియో ఫంక్షన్స్ లోనే ఇది వెరైటీగా నిలిచిపోయేలా ప్లాన్ చేస్తున్నారట. మరో రెండు మూడు రోజుల్లో ఆడియో ఫంక్షన్ డేట్ ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.  
Mahesh Babu

More Telugu News