Chandrababu: పేరు ఏదైనా రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందడమే ముఖ్యం!: పవన్ కల్యాణ్

  • ప్రత్యేక హోదా రాజకీయ పార్టీల డిమాండ్ మాత్రమే
  • దీనిపై ప్రజలకు పట్టింపు లేదు
  • బీజేపీపై ఏపీ ప్రజలకు నమ్మకం లేదు
ప్రత్యేక హోదా అనేది రాజకీయ పార్టీల నుంచి వస్తున్న డిమాండ్ మాత్రమేనని, ఎమోషన్స్ నుంచి వచ్చింది కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఈ డిమాండ్ వచ్చిందని తెలిపారు. దీనిపై ప్రజలకు ప్రత్యేకంగా ఎలాంటి పట్టింపు లేదని చెప్పారు.

ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ... పేరు ఏదైనా రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందడమే ముఖ్యమని అన్నారు. థర్డ్ ఫ్రంట్ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి చంద్రబాబుకు చాలా సార్లు చెప్పానని... అయినా ఆయన పట్టించుకోలేదని అన్నారు. బీజేపీ పట్ల ఏపీ ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారని చెప్పారు. ప్రధాని మోదీతో తనకు సాన్నిహిత్యం ఉందని తెలిపారు. తాను ప్రజాప్రతినిధిని కాకపోవడంతో, ఆయన వద్దకు వెళ్లి మాట్లాడలేకపోతున్నానని చెప్పారు. జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. 
Chandrababu
Pawan Kalyan
BJP
Special Category Status

More Telugu News