Chandrababu: చంద్రబాబుకు 2.5 మార్కులు... కేసీఆర్ కు 6 మార్కులు: పవన్ కల్యాణ్

  • రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి చంద్రబాబుకు తెలుసు
  • లోకేష్ లింకులపై న్యాయ విచారణ చేపట్టాలి
  • టీడీపీ, బీజేపీ గొడవలో జోక్యం చేసుకోను
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విమర్శలు కురిపించారు. ప్రభుత్వంలో ఎక్కడెక్కడ అవినీతి జరుగుతోందో చంద్రబాబుకు తెలుసని అన్నారు. టీడీపీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు, కొందరు నేతలు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై తనతో చెప్పారని తెలిపారు.

మంత్రి లోకేష్ కు ఉన్న లింకులపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే ... టీడీపీ, బీజేపీకి మధ్య జరుగుతున్న గొడవలో తాను జోక్యం చేసుకోదలుచుకోలేదని చెప్పారు. పరిపాలన పరంగా చంద్రబాబుకు 2.5 మార్కులు, కేసీఆర్ కు 6 మార్కులు వేస్తున్నట్టు తెలిపారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. 
Chandrababu
Nara Lokesh
Pawan Kalyan
Telugudesam
bjp

More Telugu News