KCR: హైదరాబాద్‌ నుంచి బయలుదేరి.. కోల్‌కతా చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఘన స్వాగతం

  • స్వాగతం పలికిన పశ్చిమ బెంగాల్ మంత్రి పూర్ణేన్ద్ బసు, ఉన్నతాధికారులు
  • థర్డ్‌ ఫ్రంట్‌పై మమతా బెనర్జీతో చర్చించనున్న కేసీఆర్‌
  • కాసేపట్లో ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ
దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తానని ఇటీవలే ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన కాసేపట్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవనున్నారు. ఇప్పటికే ఆయన కోల్‌కతా విమానాశ్రయం చేరుకున్నారు. కేసీఆర్‌కి పశ్చిమ బెంగాల్ మంత్రి పూర్ణేన్ద్ బసు, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు.
  అంతకు ముందు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ఎక్కడానికి వచ్చిన ఆయనకు తెలంగాణ మంత్రులు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
KCR
Telangana
kolkata

More Telugu News