Narendra Modi: మోదీని నాలుగుసార్లు కలిశా.. ఆయనతో నేను చర్చించింది ఇదే: విజయసాయిరెడ్డి

  • రాష్ట్ర ప్రయోజనాల గురించి మోదీతో మాట్లాడా
  • చంద్రబాబు అవినీతి గురించి వివరించా
  • కేసుల నుంచి బయటపడేందుకు మోదీని కలవలేదు
ప్రధాని మోదీని తాను మూడు నుంచి నాలుగు సార్లు కలిశానని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ మూడు, నాలుగుసార్లు కూడా తాను రాష్ట్ర సమస్యల గురించే చర్చించానని చెప్పారు. దీంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ అవినీతిని కూడా ప్రధాని దృష్టికి తీసుకొచ్చానని తెలిపారు. పన్నుల రూపంలో ప్రజలు చెల్లిస్తున్న ధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేస్తోంది, కేంద్ర నిధులను ఎలా దారి మళ్లిస్తోంది? అనే విషయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.

చంద్రబాబు తన అవినీతి సొమ్మును హవాలా రూపంలో విదేశాలకు తరలిస్తున్నారనే విషయాన్ని అనేక సందర్భాల్లో కేంద్రం దృష్టికి తాను తీసుకొచ్చానని తెలిపారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు తాము మోదీని కలుస్తున్నామంటూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. తమపై ఉన్న కేసులు ప్రభుత్వ పరిధిలో లేవని, కోర్టుల పరిధిలో ఉన్నాయని... అన్ని కేసుల విచారణ ముగిసిందని తెలిపారు. 
Narendra Modi
Vijay Sai Reddy
Chandrababu
cases

More Telugu News