ram vilas paswan: పాశ్వాన్ చెప్పారంటే... మోదీ ఇక ఆందోళన చెందాల్సిందే: ట్విట్టర్ల అభిప్రాయం

షార్ట్స్‌లో చూడండి
రాజకీయంగా ఏం జరగబోతోంది, ఎన్నికల్లో ఏ పార్టీకి విజయావకాశాలు ఉంటాయనే విషయంలో ముందుగానే ఊహించి కచ్చితంగా చెప్పడంలో లోక్ జనశక్తి (ఎల్జేపీ) అధినేత, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అందెవేసిన చేయిగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సమ్మిళిత సమాజాన్ని నిర్మించడం ఎలాగన్నది కాంగ్రెస్ నుంచి బీజేపీ నేర్చుకోవాలని పాశ్వాన్ ప్రకటించడంతో ట్విట్టర్లో ఎంతో మంది దీనిపై స్పందించారు.

అత్యంత కచ్చితమైన వాతావరణ అంచనా వేయగల వ్యక్తిగా ఆయన్ను అభివర్ణిస్తూ ట్వీట్లు పెట్టేస్తున్నారు. వీరు ఈ విధంగా అనడం వెనుక వాస్తవాలు లేకపోలేదు. గతంలోనూ పాశ్వాన్ ఎవరు విజేత కాగలరన్న విషయంలో ముందస్తు అంచనాలు వేసుకుని కేంద్రంలో అధికారాన్ని పంచుకున్న సందర్భాలున్నాయి. అటువంటి నేత కేంద్రంలో భాగస్వామ్య పక్షంగా ఉంటూనే ఇలా వ్యాఖ్యానించడం వెనుక తగినంత అర్థం ఉంటుందంటున్నారు.

‘పాశ్వాన్ భారత దేశంలో అత్యంత కచ్చితత్వంతో కూడిన నిపుణుడు. అంచనాలు వేయడంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది, పాశ్వాన్ అత్యంత అధునాతన వాతావరణ అంచనాలు వేసే భారత దేశ శాటిలైట్, మోదీ నిజంగా ఆందోళన చెందాల్సిందే. ఎందుకంటే రామ్ విలాస్ పాశ్వాన్ కంటే ఏ పోల్ ఏజెన్సీ కూడా ఎన్నికల ఫలితాలను అంత కచ్చితంగా అంచనా వేయలేదు’ అంటూ ట్విట్టర్లో పలువురు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
Go Back to Shorts
ram vilas paswan
twitter
Narendra Modi

More Telugu News