janasena: ఐదుగురు సభ్యులతో జనసేన స్పీకర్ల ప్యానల్ ఎంపిక ప్రకటన

  • విజయవాడలో ఐదుగురు జనసేన స్పీకర్లు
  • పార్టీ కార్యకర్తలకు స్పీకర్ల ప్యానెల్ పరిచయం
  • త్వరలో రైతులు, విద్యార్థులు, మహిళా విభాగాల కమిటీల నియామకం
ఐదుగురు సభ్యులతో జనసేన స్పీకర్ల ప్యానెల్ ఏర్పాటైంది. విజయవాడలో పార్టీ తరపున స్పందించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్యానల్ స్పీకర్ల విభాగం ఏర్పాటైంది. ఈ మేరకు జనసేన సమన్వయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ పార్టీ నేత అద్దేపల్లి శ్రీధర్ ప్యానల్ స్పీకర్లను పార్టీ కార్యకర్తలకు పరిచయం చేశారు. పోతిన వెంకటమహేష్‌, కాటూరి శ్రీనివాస్‌, మండలి రాజేష్‌, కామరాజు హరిష్‌ కమార్‌, బొప్పన శాంసన్‌ లను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచనల మేరకు ప్యానల్‌ స్పీకర్లుగా నియమించినట్టు తెలిపారు. త్వరలో రైతులు, విద్యార్థులు, మహిళా విభాగాల, రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నారని ఆయన తెలిపారు.
janasena
Pawan Kalyan
Vijayawada

More Telugu News