ayodhya: రాహుల్ జీ... దేశం పట్ల మీకున్న ప్రేమను చాటుకోండి: యూపీ వక్ఫ్ బోర్డ్ చీఫ్

షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర షియా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ వసీమ్ రిజ్వి మరోసారి రామ మందిరం అంశంపై తనదైన శైలిలో మాట్లాడారు. దేశంలో మతసామరస్యాన్ని పాదుకొల్పేందుకు మోదీ సర్కారుతో కలసి పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సూచించారు. ‘‘రాహుల్ గాంధీ తన దేశం పట్ల, దేవుడి పట్ల తనకున్న ప్రేమను చాటుకోవాలి. రాముడు జన్మించిన అయోధ్యలో రామాలయం నిర్మాణం చేసేందుకు భారత ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలి. మసీదును లక్నోలో నిర్మించాలి’’ అని రిజ్వి ప్రకటించారు. అయోధ్య అంశంలో జాతిని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ప్రధాని మోదీని రాహుల్ గాంధీ విమర్శించడంతో దానికి కౌంటర్ గా రిజ్వి ఇలా స్పందించడం గమనార్హం. 
Go Back to Shorts
ayodhya
up waqf board
rahul

More Telugu News