Telugudesam: టీడీపీ అవిశ్వాసానికి మద్దతుపై నిర్ణయం తీసుకుంటాం: బీజేడీ

  • ఇప్పటికైతే నిర్ణయం తీసుకోలేదు
  • రాష్ట్రంలో రాష్ట్రపతి పర్యటిస్తున్నారు
  • పర్యటన ముగిసిన తర్వాత సీఎం నిర్ణయం తీసుకుంటారు
  • బీజేడీ ఎంపీ పేకే దేవ్
కేంద్రంలోని మోదీ సర్కారుపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకాలా, వద్దా? అన్న విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఒడిశాలోని అధికార పార్టీ బిజూ జనతాదళ్ (బీజేడీ) స్పష్టం చేసింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పీకే దేవ్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తమ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని, రాష్ట్రపతి పర్యటన ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ విషయమై ఓ నిర్ణయం తీసుకుంటారని దేవ్ వెల్లడించారు.

బిజూ జనతాదళ్ కు లోక్ సభలో 20 మంది ఎంపీల బలగం ఉంది. రాజ్యసభలోనూ ఈ పార్టీకి ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం లోక్ సభలో 539 మంది సభ్యులు ఉండగా, బీజేపీకి మెజారిటీ మార్కు 270 కంటే కాస్తంత ఎక్కువే 274 మంది సభ్యులు ఉన్నారు.
Telugudesam
no confidence motion
bjd

More Telugu News