Chandrababu: పవన్ కల్యాణ్ చేసిన అతి పెద్ద తప్పు ఇదే: ఎంపీలతో చంద్రబాబు

  • జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • మన దెబ్బకు స్టాక్ మార్కెట్ కూడా పడిపోయింది
  • టీడీపీని తిట్టడమే పవన్ చేసిన తప్పు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే మనం జాతీయ పార్టీల మద్దతు కోరుతున్నామని టీడీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నామనే తప్పుడు ప్రచారాన్ని మనపై చేస్తున్నారని చెప్పారు. బీజేపీ నుంచి టీడీపీ విడిపోయాక స్టాక్ మార్కెట్ నష్టపోయిందని తెలిపారు. జాతీయ మీడియాలో మన అంశంపైనే భారీ ఎత్తున చర్చ జరుగుతోందని చెప్పారు. ఈ రోజు పార్టీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు... ఈ మేరకు వ్యాఖ్యానించారు.

బీజేపీతో వైసీపీ కుమ్మక్కైందనే విషయం అందరికీ అర్థమైందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. బీజేపీ, జగన్, పవన్ కల్యాణ్ లు చేస్తున్న తప్పులన్నీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. మొన్నటిదాకా మనతోనే ఉండి, ఇప్పుడు మనల్ని తిట్టడమే పవన్ చేసిన అతి పెద్ద తప్పు అని అన్నారు. అవిశ్వాస తీర్మానానికి పార్లమెంటులో పట్టుబట్టాలని... డివిజన్ కోసం డిమాండ్ చేయాలని ఎంపీలకు మార్గనిర్దేశం చేశారు.  
Chandrababu
Pawan Kalyan
Jagan
no confidence motion
Telugudesam

More Telugu News