Telugudesam: మోదీ ప్రభుత్వాన్ని కూల్చాలని అవిశ్వాసం పెట్టడం లేదు: టీడీపీ ఎంపీ నాయుడు

  • పార్లమెంటులో పార్టీల మద్దతు కూడగట్టడం
  • ప్రత్యేక హోదాపై చర్చ జరిగేలా చూడడం
  • వీటి కోసమే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం
కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో ఇన్నాళ్లూ భాగస్వామిగా ఉన్న టీడీపీ, ప్రత్యేక హోదా కోసం బయటకు వచ్చి అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్టు ప్రకటించింది. అయితే మోదీ సర్కారును పడగొట్టాలన్న ఆలోచనతో అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదని ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. పార్లమెంటులో అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్టు చెప్పారు.

పార్లమెంటులో తమకు మద్దతు తెలపాల్సిన బాధ్యత అన్ని పార్టీలపైనా ఉందన్నారు. సాధ్యమైనంత వరకూ మద్దతు కూడగట్టడం ద్వారా ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చ జరిగేలా చూడడమే తమ లక్ష్యమని దీని వెనుక ఉన్న వ్యూహాన్ని రామ్మోహన్ నాయుడు బయటపెట్టారు. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి ఇప్పటికే కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
Telugudesam
no confidence motion

More Telugu News