Chandrababu: ప్రత్యేక హోదాపై పేటెంట్ హక్కులు మావే: విజయసాయిరెడ్డి

  • ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా పోరాడుతున్నాం
  • ఇకపై కూడా మా పోరాటం కొనసాగుతుంది
  • తెలుగు జాతికి ద్రోహం చేసిన పార్టీ టీడీపీ
ఏపీకి అన్యాయం జరుగుతుందని తెలిసినప్పటికీ రాష్ట్ర విభజనకు ఏపీ టీడీపీ సహకరించిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. తెలుగు జాతికి ద్రోహం చేసిన పార్టీ టీడీపీ అని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం గత నాలుగేళ్లుగా పోరాడుతున్నది వైసీపీనే అని చెప్పారు. హోదా వచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ప్రత్యేక హోదాపై పేటెంట్ హక్కు తమదే అని చెప్పారు.

కేంద్ర బడ్జెట్ ను కూడా చంద్రబాబు సమర్థించారని... వైసీపీ మాత్రం వ్యతిరేకించిందని తెలిపారు. తాము పెట్టే అవిశ్వాసానికి మద్దతు తెలపకుండా... టీడీపీనే అవిశ్వాసం పెడుతున్నట్టు చంద్రబాబు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రంతో లాలూచీ పడి ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకున్నారని... ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ కొత్త పల్లవి అందుకున్నారని చెప్పారు. విభజన సమయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అందరూ గమనించారని తెలిపారు.
Chandrababu
Vijay Sai Reddy
YSRCP
Telugudesam
Special Category Status

More Telugu News