Rusia: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ ఘనవిజయం ఖాయం.. ఎగిట్ పోల్స్ వెల్లడి!

  • గత రెండు దశాబ్దాలుగా అధికారంలో పుతిన్
  • 73.9 శాతం  ఓట్లు ఆయనవే
  • అధ్యక్ష బాధ్యతలు లాంఛనమే
  • వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్
ఆదివారం నాడు రష్యాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ ఘన విజయం సాధించినట్టు తెలుస్తోంది. గడచిన 20 సంవత్సరాలుగా అధ్యక్ష పీఠంపై ఉన్న ఆయన్నే ప్రజలు ఎన్నుకున్నారని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఆయన వరుసగా నాలుగోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారని, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం నామమాత్రమేనని ఎగ్జిట్ పోల్స్ జరిపిన పలు సంస్థలు వెల్లడించాయి.

ఆయనకు 73.9 శాతం వరకూ ఓట్లు పోల్ అయ్యాయని, దేశవ్యాప్తంగా 10.70 కోట్ల మంది ఓటర్లుండగా, మెజారిటీ ప్రజలు మళ్లీ ఆయన్నే కోరుకున్నారని తెలిపాయి. కాగా, ఈ ఎన్నికల్లో పుతిన్ తో పాటు ఏడుగురు పోటీ పడగా, న్యాయ పరమైన కారణాలతో ప్రధాన ప్రత్యర్థి అలెక్సీ నావెల్నీ ముందే తప్పుకున్న సంగతి తెలిసిందే.
Rusia
Putin
President Elections

More Telugu News