Pawan Kalyan: పవన్, బీజేపీ లేకుంటే జగన్ సీఎం అయ్యేవారు: విష్ణుకుమార్ రాజు

  • పవన్ ప్రచారం చేయకుంటే జగన్ సీఎం అయ్యేవారు
  • టీడీపీ నేతల అవినీతి బాగా పెరిగింది
  • ఇక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం
  • బీజేపీ శాసనసభాపక్ష నేత
గత ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోకున్నా, పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వకున్నా టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఉండేవారు కాదని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తమతో టీడీపీ పొత్తు పెట్టుకోకపోయినా, పవన్ ప్రచారం చేయకున్నా జగన్ సీఎం అయ్యేవారని, చంద్రబాబు మరోసారి ప్రతిపక్షంలో కూర్చుని ఉండేవారని అన్నారు.

 టీడీపీ తమకు మిత్రపక్షం కాబట్టే ఇప్పటి వరకు సంయమనంతో వ్యవహరించామని, ఇకపై అలా ఉండదని తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపై తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. విశాఖపట్టణంలో జరిగిన భూ కుంభకోణాలు వెలుగులోకి రావడానికి కారణం తానేనన్నారు. తనవల్లే ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైందన్నారు. టీడీపీ నేతల అవినీతి బాగా పెరిగిందని ఆరోపించారు. ఇకపై రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందని అన్నారు. విశాఖపట్టణం రైల్వే జోన్‌పై మాట్లాడుతూ.. రైల్వే జోన్ తప్పకుండా వచ్చి తీరుతుందని విష్ణుకుమార్ రాజు విశ్వాసం వ్యక్తం చేశారు.
Pawan Kalyan
BJP
Jagan
Chandrababu
vishnu kumar raju

More Telugu News