anasuya: 'రంగమ్మత్తా' అని ఆటపట్టించిన సుమ.. 'నేను మా చిట్టిబాబుకి మాత్రమే రంగమ్మత్తని' అని చెప్పిన అనసూయ

  • విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద 'రంగస్థలం' ప్రీ రిలీజ్ ఈవెంట్
  • వేదికపై సుమ చమక్కులు
  • చరణ్‌తో అత్తా అని పిలిపించుకోవడం మొదట నచ్చలేదన్న అనసూయ
మెగా హీరో రామ్ చరణ్ తేజ్ తన అభిమాన నటుడని, ఆయనతో తాను అత్తా అని పిలిపించుకోవడం, తాను అల్లుడు అని పిలవడం వంటి పాత్రను చేయలేనని దర్శకుడు సుకుమార్‌తో మొదట చెప్పానని, చివరకు చేశానని నటి, యాంకర్ అనసూయ చెప్పింది. తామందరం కలిసి ప్రేక్షకులను ఈ సినిమా ద్వారా పల్లెటూరు వాతావరణంలోకి తీసుకెళతామని తెలిపింది. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద జరుగుతోన్న రంగస్థలం ప్రీ రిలీజ్ వేడుకలో ఆమె వేదికపై సుమతో మాట్లాడుతూ, తనను ఇంత త్వరగా వేదికపైకి ఎందుకు పిలిచావని అడిగింది.

దేవిశ్రీ ప్రసాద్ వేదికపై ఉన్నప్పుడు తాను మాట్లాడాలనుకున్నానని అనసూయ చెప్పింది. అనంతరం సుమ మాట్లాడుతూ తనను కూడా ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ కు అక్కగా తీసుకోవాలని ముందుగా అనుకున్నారని, కానీ తనలాంటి నటిని తీసుకుంటే చెల్లిగా తీసుకోవాలి కానీ, అక్కగా తీసుకుంటే బాగుండదని తీసుకోలేదని చమత్కరించింది. అనంతరం అనసూయకి శుభాకాంక్షలు చెబుతూ 'రంగమ్మత్త' అంటూ ఆటపట్టించింది. దీంతో అనసూయ 'నేను మా చిట్టిబాబుకి మాత్రమే రంగమ్మత్తని' అని చెప్పింది. 
anasuya
suma
Ramcharan

More Telugu News