Sri Lanka: ఫైనల్ టీ20 మ్యాచ్‌: బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్

  • కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్‌
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
  • ఒకే ఒక మార్పుతో బరిలోకి టీమిండియా
కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ముక్కోణపు టోర్నీలో చివరి పోరు ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ ఓపెనర్లు తమిమ్ ఇక్బల్, లిటోన్ దాస్ బ్యాటింగ్ ప్రారంభించారు. ప్రత్యర్థి జట్లతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలై ఈ టోర్నీ నుంచి శ్రీలంక నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచులు ఆడిన భారత్ ఆ రెంటిలోనూ విజయం సాధించింది. ఒకే ఒక మార్పుతో టీమిండియా బరిలోకి దిగింది. సిరాజ్ స్థానంలో ఉనద్కత్ ఆడుతున్నాడు. 
Sri Lanka
Cricket
India
Bangladesh

More Telugu News