Ayodhya: మరోసారి హిందువులు బలిదానం చేయాల్సిన సమయం: బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

  • రామ జన్మభూమి కోసం ఉద్యమించాలి
  • హిందూ యువకుల త్యాగాలతోనే కోరిక సిద్ధి
  • బీజేపీ ఎంపీ వినయ్ కతియార్
హిందువులు తమ చిరకాల వాంఛ అయిన అయోధ్య రామాలయం కోసం మరోసారి త్యాగాలకు, బలిదానాలకు సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందని బీజేపీ పార్లమెంట్ సభ్యుడు వినయ్ కతియార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామజన్మభూమి మరొక్కసారి హిందూ యువకుల నుంచి త్యాగాలను ఆశిస్తోందని, అప్పుడే జీవితకాల కోరిక పూర్తవుతుందని ఆయన అన్నారు. ప్రతి హిందువూ ఇందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మరోసారి రామజన్మభూమి కోసం ఉద్యమించాలని, అందుకు ఇదే సరైన సమయమని ఆయన అన్నారు.

కాగా, 1992, డిసెంబర్ 6వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో కరసేవకులు బాబ్రీ మసీదుపై జరిపిన దాడిలో పోలీసుల కాల్పులకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వివిధ ప్రాంతాల్లో జరిగిన మత ఘర్షణల్లో దాదాపు 2 వేల మందికి పైగానే మరణించారు. అప్పటి నుంచి రామజన్మభూమి కేసు సుప్రీంకోర్టులో విచారణ ఉండగా, ప్రస్తుతం తుది విచారణ జరుగుతోంది. ఈ సమయంలో వినయ్ కతియార్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
Ayodhya
Ramjanma Bhoomi
Vinay Katiyar

More Telugu News