YSRCP: ప్రశాంత్ కిశోర్ ఢిల్లీలోనే లేరు... బీజేపీతో కలవలేదు: ఐ-ప్యాక్ స్పష్టీకరణ

  • నిన్న ప్రశాంత్ కిశోర్, అమిత్ షాల మధ్య భేటీ అవాస్తవం
  • ట్విట్టర్ లో వెల్లడించిన ఐ-ప్యాక్
  • అవాస్తవ కథనాలతో ఏం సాధిస్తారంటూ అసహనం
2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తున్న వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, బీజేపీ నేతలను ఢిల్లీలో కలిశారని వచ్చిన వార్తలను ఆయన సంస్థ ఐ-ప్యాక్ ఖండించింది. శనివారం నాడు ప్రశాంత్ కిషోర్ అసలు ఢిల్లీలోనే లేరని, అలాంటప్పుడు ఏపీ బీజేపీ నేతలతో కలసి, అమిత్‌ షాను ఎలా కలుస్తారని ట్విట్టర్ ఖాతాలో ప్రశ్నించింది.

ఆయన అమిత్ షాను కలిశారనడం అవాస్తవమని, ఇటువంటి అవాస్తవ కథనాలను ప్రసారం చేయడం, ప్రచురించడం ద్వారా ఏం సాధిస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది. కాగా, నిన్న ప్రశాంత్, అమిత్ షాల మధ్య చర్చలు జరిగాయని, బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు పొత్తు కుదిర్చేందుకు ఆయన రంగంలోకి దిగారని నిన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
YSRCP
BJP
Prashant Kishore

More Telugu News