kishan reddy: ఆ రోజు మోదీ తిరుపతిలో ఎవరో రాసిచ్చిన చీటీ చూసి చెప్పిన మాటలే అవి!: కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

  • తిరుపతిలో హోదాపై అవగాహన లేకుండా మోదీ మాట్లాడారు
  • హోదా ఇస్తే దేశమంతా అశాంతి
  • పవన్, జగన్ తో పొత్తుపై చర్చించలేదు
  • తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి
2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరుపతిలో జరిగిన సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై నరేంద్ర మోదీ అవగాహన లేకుండా మాట్లాడారని తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాడు ఎవరో రాసిచ్చిన చీటీలో ఉన్న మాటలనే ఆయన చెప్పారని, హోదా ఇచ్చే పరిస్థితులపై మోదీకి ఎంతమాత్రమూ తెలియకుండానే మాట్లాడారని చెప్పారు. హోదా ఇస్తే, దేశమంతా అశాంతి నెలకొంటుందన్న ఆలోచనతోనే ప్రత్యేక ప్యాకేజీవైపు కేంద్రం మొగ్గు చూపిందని, చెప్పిన ప్రకారం ప్యాకేజీ నిధులను ఇస్తూనే ఉందని అన్నారు.

 అవిశ్వాసం పెట్టే హక్కు అన్ని పార్టీలకూ ఉంటుందని, చర్చ జరిగితే సమాధానం ఇచ్చేందుకు మోదీ సిద్ధంగా ఉన్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ లో తెలంగాణతో పోలిస్తే ఏపీకే ఎక్కువ నిధులు వెళ్లాయని, హోదా విషయంలో టీడీపీ నేతలు అసత్య ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీలతో బీజేపీ పొత్తుపై ఇంతవరకూ ఎలాంటి చర్చలూ జరగలేదని అన్నారు. ఏపీలో జగన్ ను ప్రతిపక్ష నేతగా గుర్తించారని, అటువంటి వ్యక్తికి ప్రధాని అపాయింట్ మెంట్ ఇస్తే తప్పేంటని అడిగారు.
kishan reddy
Narendra Modi
Pawan Kalyan
Jagan
Special Category Status

More Telugu News