Rajanikant: హిమాలయాల నుంచి అమెరికాకు రజనీకాంత్!

  • గతవారం హిమాలయాలకు వెళ్లిన రజనీకాంత్
  • మరో వారం తరువాత అమెరికాకు
  • వైద్య పరీక్షల కోసమే
ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా హిమాలయాల్లో పర్యటిస్తున్న దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్, అటునుంచి నేరుగా అమెరికా వెళ్లనున్నారు. గత వారం హిమాలయాలకు వెళ్లిన ఆయన, మరో వారం పాటు అక్కడే ఉంటారని, వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారని, ఆపై సంపూర్ణ వైద్య ఆరోగ్య పరీక్షల కోసం అమెరికాకు వెళతారని రజనీ సన్నిహత వర్గాలు వెల్లడించాయి.

అమెరికాలో వైద్య పరీక్షల అనంతరం మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ తొలి వారంలో చెన్నై చేరుకుంటారని తెలిపాయి. రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు తన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి అవగాహనకు రావాలన్నది రజనీ ఆలోచనని, అమెరికా నుంచి తిరిగి వచ్చిన తరువాత పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమవుతారని తెలుస్తోంది. కాగా, రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన సింగపూర్ లో చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.
Rajanikant
Himalayas
USA

More Telugu News