Jagan: కేసీఆర్ కు ఉన్నదంటి? చంద్రబాబుకు లేనిదేంటి?: జగన్

  • తెలంగాణలో బీడు భూమి సాగులోకి వస్తోంది
  • లిఫ్టులను పెట్టి నీళ్లు తోడిస్తున్నారు
  • ఏపీలో మాత్రం రైతుల పరిస్థితి దయనీయం
  • రైతు ఆత్మీయ సదస్సులో జగన్
గడచిన నాలుగు సంవత్సరాల్లో తెలంగాణలో ఎంతో బీడు భూమి సాగులోకి వచ్చిందని, లిఫ్టులు పెట్టి మరీ కేసీఆర్ నీళ్లు తోడిస్తున్నారని, చంద్రబాబు మాత్రం తన స్వార్థప్రయోజనాలే తప్ప రైతుల గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన రైతు ఆత్మీయ సదస్సులో పాల్గొని ప్రసంగించిన జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఉన్నది ఏంటి? సీఎం చంద్రబాబుకు లేనిది ఏంటి? అని ప్రశ్నించారు.

పైనుంచి రావాల్సిన నీళ్లను తెలంగాణ అడ్డుకుంటుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని అడిగారు. ఏపీలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిపోయిందని, తమ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 12,500 పెట్టుబడిని అందిస్తామని, ఉచితంగా పొలాల్లో బోర్లను వేయిస్తామని తెలిపారు. ధరల స్థిరీకరణ కోసం రూ. 3 వేల కోట్లతో నిధిని కేటాయిస్తామని, పగటిపూటే 9 గంటల కరెంటును ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు.
Jagan
Chandrababu
KCR
Andhra Pradesh
Telangana

More Telugu News