Sonia Gandhi: మరోసారి తనయుడి ప్రేమను చాటిన రాహుల్ గాంధీ

షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తన తల్లిపై ఉన్న ప్రేమను అందరి ముందూ చాటిచెప్పాడు. కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ  బాధ్యతలు స్వీకరించిన సంద‌ర్భంగా వేదిక‌పై రాహుల్ గాంధీ త‌న త‌ల్లి సోనియా గాంధీ నుదిటిపై ముద్దు పెట్టిన విషయం తెలిసిందే. ఈ రోజు ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ప్లీన‌రీ స‌మావేశంలో సోనియా గాంధీ వేదికపై ప్రసంగించి కిందకు వచ్చిన వెంటనే, అందరూ నిలబడి చప్పట్లు కొట్టి ఆమెను అభినందించారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆమెను ఆలింగనం చేసుకుని త‌న‌యుడి ప్రేమ‌ను చాటాడు. కాంగ్రెస్ పార్టీకి అధ్య‌క్షుడ‌యిన‌ప్ప‌టికీ రాహుల్ గాంధీ ఓ త‌ల్లికి కుమారుడేన‌ని నెటిజ‌న్లు అభినందిస్తున్నారు. ఈ ఫొటోల‌ను కాంగ్రెస్ పార్టీ త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Go Back to Shorts
Sonia Gandhi
Rahul Gandhi
New Delhi

More Telugu News