venkatesh: అటు వెంకీకి.. ఇటు నాగ్ కీ జోడీగా అమలా పాల్!

  • అనిల్ రావిపూడితో వెంకటేశ్ 
  • శ్రీరామ్ ఆదిత్యతో నాగార్జున 
  • ఇద్దరి సినిమాల్లోను అమలా పాల్
తెలుగులో అమలా పాల్ కి అవకాశాలు తగ్గినా, తమిళ .. మలయాళ భాషల్లో ఆమె జోరు కొనసాగుతూనే వుంది. కొంత గ్యాప్ వచ్చినా తెలుగు నుంచి మళ్లీ ఆమెకి అవకాశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి ఒక మల్టీ స్టారర్ మూవీని చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ సినిమాలో వెంకటేశ్ సరసన కథానాయికగా అమలా పాల్ ను తీసుకున్నట్టుగా సమాచారం.

ఇక దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కూడా నాగార్జున - నాని కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ ను స్టార్ట్ చేయనున్నాడు. ఈ సినిమాలో నాగార్జున జోడీగా అమలా పాల్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఇద్దరి సీనియర్ హీరోల సినిమాల్లో అమలా పాల్ కి ఛాన్స్ దక్కడం నిజమే అయితే, ఆమెకి ఇక్కడ మరిన్ని అవకాశాలు దక్కడం ఖాయమని అంటున్నారు.
venkatesh
nagarjuna
amalapaul

More Telugu News