Jagan: జగన్ వ్యూహంలో చంద్రబాబు చిక్కుకున్నారు: బీజేపీ ఎంపీ హరిబాబు

  • టీడీపీ, బీజేపీలను విడగొట్టాలనేది జగన్ వ్యూహం
  • టీడీపీని రెచ్చగొట్టడంలో వైసీపీ విజయవంతమైంది
  • లేనిపోని అపోహలతో ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది
వైసీపీ అధినేత జగన్ పన్నిన వ్యూహంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిక్కుకున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీలు విడిపోతే జగన్ కే లాభమని... ఈ నేపథ్యంలోనే, టీడీపీని జగన్ రెచ్చగొట్టారని అన్నారు. జగన్ రెచ్చగొట్టడం వల్లే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిందని, అవిశ్వాస తీర్మానం పెట్టిందని చెప్పారు. టీడీపీని రెచ్చగొట్టడంలో వైసీపీ విజయం సాధించిందని అన్నారు.

ఏపీలో పైచేయి సాధించేందుకు టీడీపీ, వైసీపీలు యత్నిస్తున్నాయని... ఇందులో ఒక భాగమే అవిశ్వాసం అని హరిబాబు చెప్పారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం అండగానే ఉందని, లేనిపోని అపోహలతో ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిందని అన్నారు. ఏపీలో కనిపిస్తున్న అభివృద్ధికి కేంద్ర సహకారమే కారణమని చెప్పారు. 
Jagan
Chandrababu
Telugudesam
YSRCP
BJP
NDA
hari babu

More Telugu News