Pawan Kalyan: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించిన బాలకృష్ణ!

  • పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించిన బాలయ్య
  • 'ఒకరిని హీరో చేయడం నాకు ఇష్టం లేదు.. నేనే సూపర్ హీరో' అని వ్యాఖ్య
  • హిందూపురంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన బాలయ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల గుంటూరులో నిర్వహించిన మహాసభలో ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ నేతలందరూ మండిపడుతుండగా బాలకృష్ణ మాత్రం స్పందించడం లేదు. ఈ రోజు అనంతపురం హిందూపురంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలకృష్ణ.. 2 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా అడగగా బాలకృష్ణ అందుకు నిరాకరించారు. 'ఒకరిని హీరో చేయడం నాకు ఇష్టం లేదు.. నేనే సూపర్ హీరో' అని అన్నారు. గతంలోనూ పవన్ కల్యాణ్ గురించి స్పందించమని అడిగితే బాలయ్య ఇదే విధంగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. 
Pawan Kalyan
Andhra Pradesh
Balakrishna

More Telugu News