Bollywood actress Shriya Saran: కుటుంబసభ్యుల సమక్షంలో సింపుల్‌గా నటి శ్రియ వివాహం

  • రష్యా ప్రియుడు ఆండ్రీతో ఈ నెల 12న సీక్రెట్‌గా శ్రియ వివాహం
  • కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు
  • ఓన్లీ ఎట్రాక్షన్‌గా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ దంపతులు
  • ఈ రోజు వివాహానంతర ధూం ధాం కార్యక్రమాలు
తెలుగు, తమిళం, హిందీ చిత్రాలతో సౌత్‌లో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న ఢిల్లీ భామ శ్రియ శరణ్ ఎట్టకేలకు ఓ ఇంటిదైంది. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో తన రష్యా ప్రియుడు ఆండ్రీ కోషీవ్‌ను ఆమె ఈ నెల 12న వివాహం చేసుకున్నట్లు 'మిడ్ డే' టాబ్లాయిడ్ ఓ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం, అంథేరిలోని శ్రియ నివాసంలో ఆండ్రీతో ఆమె వివాహం చాలా హడావిడిగా జరిగిపోయింది.

ఈ వివాహానికి సన్నిహిత మిత్రులతో పాటు శ్రియ ఇంటికి పక్కనే ఉన్న బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్, ఆయన భార్య షబానా మాత్రమే హాజరయ్యారు. వివాహానికి ముందు ఈ నెల 11న విందు కార్యక్రమం ధూం ధాంగా జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం ఆండ్రీ-శ్రియ ఇద్దరూ పెళ్లి ప్రమాణాలు చేశారు. ఈ శుభ కార్యానికి శ్రియ పింక్ కలర్ దుస్తులు ధరించింది. ఈ రహస్య వివాహం తర్వాత ఉదయ్‌పూర్‌లో నేడు తదుపరి ముఖ్యమైన కార్యక్రమాలు జరగనున్నట్లు 'మిడ్ డే' టాబ్లాయిడ్ తెలిపింది. శ్రియ చివరగా 2015లో అజయ్ దేవగణ్, టబు జంటగా వచ్చిన 'దృశ్యం' చిత్రంలో కనిపించిన సంగతి తెలిసిందే.
Bollywood actress Shriya Saran
MidDay
Andrei Koscheev

More Telugu News