Chandrababu: మూడు పార్టీల మహా కుట్రను బయటపెట్టాం.. మనం అవిశ్వాసం పెట్టగానే పార్టీలన్నీ కలసి వచ్చాయి: ఎంపీలతో చంద్రబాబు

  • అవిశ్వాసానికి మద్దతు కూడగట్టండి
  • అవిశ్వాసంపై ఓటింగ్ కు పట్టుబట్టండి
  • సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాం
ఎంపీలంతా ఈ రెండు రోజులు ఢిల్లీలోనే ఉండాలంటూ టీడీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అవిశ్వాసానికి అందరి మద్దతు కూడగట్టాలని చెప్పారు. అన్ని పార్టీల నేతలను వ్యక్తిగతంగా కలవాలని సూచించారు. ఎన్టీయే నుంచి బయటకు రావడం, అవిశ్వాసం పెట్టడం ద్వారా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

మూడు పార్టీల మహా కుట్రను ప్రజల ముందు బయటపెట్టామని బీజేపీ, వైసీపీ, జనసేనలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పార్లమెంటులో అవిశ్వాసంపై ఓటింగ్ కు పట్టుబట్టాలని దిశానిర్దేశం చేశారు. వైసీపీని ఎవరూ నమ్మడం లేదని... అందుకే ఆ పార్టీ ఇచ్చిన అవిశ్వాసానికి ఎవరూ మద్దతు ఇవ్వలేదని... మనం అవిశ్వాస తీర్మానం ఇచ్చిన వెంటనే అనేక పార్టీలు కలసివచ్చాయని చెప్పారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ మేరకు ఎంపీలకు సూచించారు.
Chandrababu
Telugudesam mps

More Telugu News