Chandrababu: చంద్రబాబుపై మరోమారు మండిపడ్డ పవన్ కల్యాణ్

  • ప్రజా విశ్వాసాన్ని చంద్రబాబు కోల్పోయారు
  • పరిస్థితులు చేజారాక చంద్రబాబు మేల్కొన్నారు
  • జాతీయ మీడియాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై, మంత్రి నారా లోకేశ్ పై పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో పవన్ పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం విదితమే. తాజాగా, చంద్రబాబుపై పవన్ మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జాతీయ మీడియాతో పవన్ మాట్లాడుతూ, ప్రజల భావోద్వేగాలతో చెలగాటమాడారని, ప్రజా విశ్వాసాన్ని చంద్రబాబు కోల్పోయారని అన్నారు. పరిస్థితులు చేజారక చంద్రబాబు మేల్కొన్నారని, ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవడం తప్ప ఆయనకు మరో మార్గం లేదని అన్నారు.
Chandrababu
Pawan Kalyan

More Telugu News