ap bjp: ఏపీ బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు !

షార్ట్స్‌లో చూడండి
ఎన్డీఏతో టీడీపీ తెగదెంపులు చేసుకుని బయటకొచ్చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీకి చెందిన కీలక నేతలకు ఢిల్లీ నుంచి పిలుపొచ్చినట్టు సమాచారం. బీజేపీ ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర ముఖ్యనేతలకు ఈ మేరకు ఆదేశాలు అందినట్టు పార్టీ వర్గాల సమాచారం. రేపు ఉదయం ఢిల్లీ బయలుదేరి వారు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఏపీలో బీజేపీ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ,  రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, రెవెన్యూ లోటు తదితర అంశాల గురించి బీజేపీ హైకమాండ్ కు వీరు వివరించనున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
ap bjp
New Delhi

More Telugu News