national anthem: జాతీయగీతంలో ఆ పదాన్ని తొలగించండి: రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్

  • సింధ్ ప్రాంతం పాకిస్థాన్ లో ఉంది
  • ఆ పదాన్ని తొలగించాలి
  • ఈశాన్య రాష్ట్రాలను జాతీయగీతంలో చేర్చాలి
జాతీయగీతంలో 'సింధ్' అనే పదాన్ని తొలగించాలని... ఆ పదం స్థానంలో 'ఈశాన్య (నార్త్ ఈస్ట్)' ను చేర్చాలనే తీర్మానాన్ని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సింధ్ అనే ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉందని తెలిపారు. భారత్ లో అంతర్భాగమైన, అత్యంత ముఖ్యమైన ఈశాన్య రాష్ట్రాలకు జాతీయగీతంలో స్థానం లేకపోవడం దారుణమని అన్నారు. జాతీయగీతంలో ఉన్న సింధ్ అనే పదాన్ని తొలగించి, ఈశాన్య రాష్ట్రాల పేరును చేర్చేలా సవరణ చేయాలని కోరారు.
national anthem
amendment
sindh
north east

More Telugu News