Pawan Kalyan: పవన్ పైన, కేంద్రంపైన నిప్పులు చెరిగిన టీటీడీపీ నేత రావుల

  • పవన్..ప్రత్యేక హోదాపై  చిరంజీవి ప్రశ్నించకపోవడంపై ప్రశ్నించవే?
  • ఆధారాలు లేకుండా లోకేశ్ పై అవినీతి ఆరోపణలు చేస్తావా?
  • ఏపీని కేంద్రం అనేక ఇబ్బందులు పెడుతోంది : రావుల
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైన, కేంద్ర ప్రభుత్వంపైన టీటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎటువంటి ఆధారాలు లేకుండా నారా లోకేశ్ పై అవినీతి ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్ ని ఓ ప్రశ్న వేస్తున్నానని, ఏపీకి ప్రత్యేక హోదాపై  రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మీ అన్న చిరంజీవి ప్రశ్నించకపోవడంపై ప్రశ్నించవే?’ అని అన్నారు.

హైదరాబాద్ లోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, పవన్ వ్యాఖ్యల్లో స్పష్టత లేదని, లోకేశ్ పై ఆయన చేసిన ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు. ఏపీని కేంద్రం అనేక ఇబ్బందులు పెడుతోందని, కేంద్రానికి రాష్ట్రాలు ఇచ్చే పన్నుల కంటే, కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధులు చాలా తక్కువని అన్నారు. ఇన్నాళ్లు ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు.
Pawan Kalyan
Telugudesam
ravula

More Telugu News