Telugudesam: టీడీపీ తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తాం!: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

  • ఏపీ ప్రయోజనాల కోసం ఏ రాజకీయ పక్షానికైనా మద్దతు ఇస్తాం
  • ఎట్టకేలకు కేంద్రంపై టీడీపీ అవిశ్వాసం పెట్టడం సంతోషకరం
  • ఒక ప్రజా ప్రతినిధిగా ప్రధానినే కాదు, ఎవరినైనా కలుస్తా : విజయసాయిరెడ్డి
కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానానికి తాము అనుకూలంగా ఓటేస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. లోక్ సభ వాయిదా అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో ఏ రాజకీయ పక్షానికైనా మద్దతు ఇచ్చేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడుపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రంపై వైసీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం విషయం చర్చకు వచ్చే దాకా ఎన్డీఏలో కొనసాగిన చంద్రబాబు, ఎట్టకేలకు బయటకు వచ్చి అవిశ్వాసం పెట్టడం సంతోషకరమైన విషయమని అన్నారు. ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రధానినే కాదు, ఎవరినైనా తాను కలుస్తానని, అందులో తప్పేముందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
Telugudesam
YSRCP
Vijay Sai Reddy

More Telugu News