Jagan: మోదీతో జతకడితే... కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎందుకిస్తాం?: రోజా

  • మోదీతో జతకడితే.. అవిశ్వాసం ఎందుకు పెడతాం?
  • మొన్నటిదాకా మంచోడన్న పవన్.. ఇప్పుడు చెడ్డ వ్యక్తి అయ్యారా?
  • ఆర్థిక నేరస్తులు చంద్రబాబు, లోకేషే
బీజేపీతో వైసీపీ అధినేత జగన్ చేతులు కలిపారంటూ వస్తున్న విమర్శలపై ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఇలాంటి విమర్శలు ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఒకవేళ మోదీతో జతకడితే... కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎందుకిస్తామని అన్నారు. మొన్నటి వరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టీడీపీ నేతలు మంచోడు అని అన్నారని... ఇప్పుడు టీడీపీ నేతలను ప్రశ్నించేసరికి ఆయన చెడ్డ వ్యక్తి అయ్యారా? అని ప్రశ్నించారు. ఆర్థిక నేరస్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేషేనని... జగన్ కాదని అన్నారు. 
Jagan
Chandrababu
Narendra Modi
Pawan Kalyan
roja

More Telugu News