Jagan: మోదీతో జతకడితే... కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎందుకిస్తాం?: రోజా

షార్ట్స్‌లో చూడండి
బీజేపీతో వైసీపీ అధినేత జగన్ చేతులు కలిపారంటూ వస్తున్న విమర్శలపై ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఇలాంటి విమర్శలు ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఒకవేళ మోదీతో జతకడితే... కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎందుకిస్తామని అన్నారు. మొన్నటి వరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టీడీపీ నేతలు మంచోడు అని అన్నారని... ఇప్పుడు టీడీపీ నేతలను ప్రశ్నించేసరికి ఆయన చెడ్డ వ్యక్తి అయ్యారా? అని ప్రశ్నించారు. ఆర్థిక నేరస్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేషేనని... జగన్ కాదని అన్నారు. 
Go Back to Shorts
Jagan
Chandrababu
Narendra Modi
Pawan Kalyan
roja

More Telugu News