bhojpuri actor: భోజ్ పురీ నటుడ్ని ఛీట్ చేసిన బిల్డర్... కేసు నమోదు

షార్ట్స్‌లో చూడండి
భోజ్ పురి యాక్షన్ హీరో సుదీప్ పాండేను మోసం చేసిన ఘటనలో పోలీసులు బిల్డర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. భోజ్ పురి నటుడు సుదీప్ పాండే ముంబైలోని తలోజా ఫేజ్ 2లో మూడు ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ఎంఆర్ ఎంటర్‌ ప్రైజెస్ అధినేత ముర్జీ రవారియాతో ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందంలో భాగంగా 28 లక్షల రూపాయల అడ్వాన్స్ కూడా చెల్లించాడు.

ఏడాదిలోపు మూడు ఫ్లాట్లు పూర్తి చేసి ఇస్తానన్న రవారియా ఐదేళ్లు గడిచినా ఫ్లాట్లు అప్పగించలేదు. దీంతో రవారియాపై సుదీప్ పాండే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. కాగా, కేసు దర్యాప్తులో సుదీప్ పాండే బుకింగ్ ను రవారియా రద్దు చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఛీటింగ్ కేసు నమోదు చేశారు.
Go Back to Shorts
bhojpuri actor
sudeep pandey
builder
police case

More Telugu News