Pawan Kalyan: ఇంత అయోమయం ఎందుకు జగన్?: పవన్ కల్యాణ్

  • అవిశ్వాస తీర్మానాలపై స్పందించిన పవన్
  • 23న అవిశ్వాసం అంటూ సడన్ గా తేదీ ఎందుకు మార్చారు?
  • అవిశ్వాసం అవసరం లేని టీడీపీ ఇప్పుడెందుకు అవిశ్వాసం కోరుతోంది?
వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల అవిశ్వాస తీర్మానాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వైసీపీ నాయకుడు జగన్ కు అవిశ్వాసంపై అంత అయోమయం ఎందుకని ప్రశ్నించారు. తాను 5వ తేదీన అవిశ్వాసం పెట్టమని ముందుగానే సలహా ఇస్తే, దాన్ని వినలేదని, తొలుత 23న అవిశ్వాసం పెడతానని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడెందుకు సడన్ గా తేదీని మార్చారని ప్రశ్నించారు. అవిశ్వాసంపై అయోమయంలో ఆ పార్టీ ఉన్నట్టు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. అసలు టీడీపీ అయితే అవిశ్వాసమే అవసరం లేదని చెప్పిందని, ఇక ఇప్పుడెందుకు అవిశ్వాసం కోరుకుంటోందని పవన్ అడిగారు. తాను టీడీపీకి చెందిన మనిషిని కాదని, బీజేపీకి చెందిన వాడినీ కాదని ప్రజల మనిషినని చెప్పారు.
Pawan Kalyan
Jagan
No Confidence Motion

More Telugu News