Jagan: హమ్మయ్య... ఇప్పటికి చంద్రబాబు నిద్రలేచారు: జగన్

  • నాలుగేళ్ల మొద్దు నిద్ర తరువాత లేచారు
  • ప్రజల హక్కులను కాపాడుకునేందుకు వైసీపీ పోరు
  • ట్విట్టర్ లో వైఎస్ జగన్
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాలుగేళ్ల మొద్దు నిద్ర తరువాత ఇప్పటికి మేల్కొన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, ప్రత్యేక హోదా కోసం వైసీపీ గత నాలుగేళ్లుగా ప్రజల సహకారంతో పోరాటం చేస్తోందని గుర్తు చేస్తూ, చివరకు ఈ విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని జాతికి తెలిసిందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులను కాపాడుకునేందుకు తమ పార్టీ పోరాడుతుందని అన్నారు. రాజకీయ కారణాలతోనే అయినా తమ అవిశ్వాసానికి టీడీపీ మద్దతిస్తానని చెప్పడం సంతోషకరమేనని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ఏపీ ప్రజలను కష్టాల నుంచి కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కదలి రావాలని పిలుపునిచ్చారు.
Jagan
Chandrababu
Special Category Status
Andhra Pradesh

More Telugu News