Pawan Kalyan: ముందే అనుమానం వచ్చింది... జగన్ తో పవన్ చేతులు కలుపుతారని!: టీడీపీ నేతలతో చంద్రబాబు

  • తనపై, తన కుమారుడిపై నిరాధార ఆరోపణలు
  • 2019లో జగన్ కు పవన్ సహకారం
  • తనకు ముందే అనుమానం వచ్చిందన్న చంద్రబాబు
బీజేపీతో కుమ్మక్కై టీడీపీపై, తనపై, తన కుమారుడిపై నిరాధార ఆరోపణలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ కు మద్దతు పలకాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీకి తాను పూర్తి సహాయ సహకారాలను అందిస్తానని పవన్ చెప్పారని, ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ వరప్రసాద్ కూడా ఒప్పుకున్నారని ఈ ఉదయం తనను కలిసిన నేతల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఓ పథకం ప్రకారం టీడీపీని నాశనం చేయాలన్న ఆలోచనలో బీజేపీ ఉందని, దానికి రాష్ట్రంలోని వైసీపీ మద్దతు పలుకుతోందని ఆరోపించారు.

 తానెంతో గౌరవించిన పవన్ కల్యాణ్ ఈ విధంగా యూటర్న్ తీసుకుంటారని ఎన్నడూ భావించలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పీఎంఓ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న విజయసాయిరెడ్డి మధ్యవర్తిగా పవన్ తో నరేంద్ర మోదీ రాజకీయం నడిపించారని ఆయన ఆరోపించారు. పవిత్ర కార్యాలయమైన పీఎంఓకు కేసుల్లో ఏ1, ఏ2లుగా ఉన్న వారికి ఆహ్వానం పలుకుతుంటేనే తనకు అనుమానం వచ్చిందని చెప్పారు. తమ పార్టీ కేంద్ర మంత్రులు రాజీనామాలు చేస్తే, దానిపై ప్రకటన చేసేందుకు కూడా బీజేపీ అవకాశం ఇవ్వలేదని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
Pawan Kalyan
Chandrababu
Jagan
Narendra Modi

More Telugu News