Chandrababu: మోదీ మహాకుట్ర... పవన్ ఆమరణ దీక్ష తరువాత హోదా ప్రకటన: చంద్రబాబు

  • హోదాకు అనుకూలంగా మోదీ నిర్ణయం
  • తనకు తెలిసిపోయిందన్న చంద్రబాబు
  • పవన్ కల్యాణ్ కు సూచనలు అందాయి
  • రాష్ట్రానికి వ్యతిరేకంగా మహాకుట్ర జరుగుతోంది
  • చంద్రబాబు సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నట్టు తనకు తెలిసిందని, అయితే, అది వైకాపా, జనసేన చేసిన నిరసనలు, కేంద్రంపై తెచ్చిన ఒత్తిడి కారణంగానే ఇస్తున్నట్టు ప్రజలను మభ్యపుచ్చాలన్నది మోదీ ఆలోచనని ఆరోపించారు. హోదా కోసం ఆమరణ దీక్షకు దిగుతానని పవన్ వెల్లడించడాన్ని గుర్తు చేసిన ఆయన, పవన్ దీక్ష తరువాత విధిలేని పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తున్నామని, ప్రజా సెంటిమెంట్ ను గౌరవిస్తున్నామని ప్రధాని నుంచి ప్రకటన వస్తుందని అంచనా వేశారు.

ఈ మేరకు ఇప్పటికే పవన్ కల్యాణ్ కు కేంద్రంలోని పెద్దల నుంచి సూచనలు అందాయని చంద్రబాబు ఆరోపించారు. కేంద్రం కుట్రలు, ఆడుతున్న డ్రామాలపై ప్రజల్లోకి వెళతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు వ్యతిరేకంగా మహాకుట్ర జరుగుతోందని, దీన్ని ఎదుర్కొంటామని ఆయన అన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని చెప్పడానికి ఇంతకన్నా రుజువులు ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. దోషులందరినీ ప్రజా కోర్టులో నిలుపుతామని ఆయన హెచ్చరించారు.
Chandrababu
Pawan Kalyan
Narendra Modi
Special Category Status
Andhra Pradesh

More Telugu News