Pawan Kalyan: ప్రత్యేక హోదా వస్తుంది... అది జగన్ వల్ల వచ్చినట్టు చూపాలని నరేంద్ర మోదీ కుట్ర: చంద్రబాబు సంచలన వ్యాఖ్య

  • రాష్ట్రానికి హోదా ఇవ్వాలని చూస్తున్న నరేంద్ర మోదీ
  • జగన్, పవన్ కారణంగానే ఇస్తున్నామన్నట్టు డ్రామా
  • టీడీపీని అస్థిరపరచాలని చూస్తున్న మోదీ: చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోదీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ లతో కలసి డ్రామాలు ఆడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలని మోదీ భావిస్తున్నారని, అయితే, అది జగన్ వల్ల వచ్చినట్టు చూపించాలని ఆయన భావిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవిశ్వాసం పెట్టి, ఆపై రాజీనామాలు చేసి తీవ్ర నిరసనలకు వైసీపీ దిగిన తరువాత, హోదా ఇవ్వాలని మోదీ భావిస్తున్నారని, దీని వెనుక తెలుగుదేశం పార్టీని అస్థిర పరచాలన్న కుట్ర ఉందని ఆయన అన్నారు. జగన్ చేసిన కృషి ఫలితంగా హోదా ఇవ్వక తప్పడం లేదని మోదీ స్వయంగా వెల్లడిస్తారని తనకు అనుమానంగా ఉందని, రాష్ట్రం విషయంలో బీజేపీ డ్రామాలు ఆడుతోందని అన్నారు.
Pawan Kalyan
Chandrababu
Jagan
bjp
Narendra Modi

More Telugu News