Telugudesam: ఎవరి వెనుకా వద్దు... సొంతంగానే అవిశ్వాసం పెట్టండి: ఎంపీలకు చంద్రబాబు ఆదేశం

  • మనమే అవిశ్వాసం పెడదాం 
  • ఎంపీలకు చంద్రబాబు ఆదేశం
  • మరికాసేపట్లో నోటీసులు ఇచ్చే అవకాశం
లోక్ సభలో ఎన్డీయే సర్కారుకు వ్యతిరేకంగా తెలుగుదేశం సభ్యులే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలను ఆదేశించారు. ఈ ఉదయం ఎంపీలు, నేతలతో అత్యవసర టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. అంతకుముందు ఎన్డీయే నుంచి వైదొలగాలని నిర్ణయించినట్టు చెప్పిన చంద్రబాబు, వదిలేసుకున్నాక, వేరే ఎవరి వెనుకో వెళ్లాల్సిన అవసరం లేదని, మనమే అవిశ్వాసం పెడదామని అన్నారు.

చంద్రబాబు నిర్ణయానికి ఎంపీలంతా ముక్తకంఠంతో ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మరికాసేపట్లో తెలుగుదేశం ఎంపీలు అవిశ్వాసంపై నోటీసులు ఇస్తారని సమాచారం. కాగా, లోక్ సభ కార్యదర్శికి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానంపై నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ అవిశ్వాసానికి మద్దతిస్తామని చంద్రబాబునాయుడు నిన్న ప్రకటించారు కూడా.
Telugudesam
BJP
No Confidence Motion

More Telugu News