Pawan Kalyan: పవన్‌.. ఎంత ప్యాకేజీకి అమ్ముడుపోయావు?: టీటీడీపీ నేత మోత్కుపల్లి

  • లోకేశ్ పై చేసిన ఆరోపణలకు ఆధారాలున్నాయా?
  • తగిన ఆధారాలు లేకపోతే బట్టలూడదీసి మరీ ప్రజలు కొడతారు
  • పవన్ కల్యాణ్ ని హెచ్చరించిన మోత్కుపల్లి
టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీటీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు విరుచుకుపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుని గొప్ప నేతగా మొన్నటి వరకు ప్రశంసించిన పవన్ కల్యాణ్ ఉన్నపళంగా మాట మార్చడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు.

‘పవన్..ఎంత ప్యాకేజీకి అమ్ముడుపోయావు? లోకేశ్ పై చేసిన ఆరోపణలకు ఆధారాలున్నాయా?’ అంటూ మోత్కుపల్లి ధ్వజమెత్తారు. లోకేశ్ పై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు కనుక లేకపోతే బట్టలూడదీసి మరీ ప్రజలు కొడతారంటూ పవన్ ని హెచ్చరించారు. నాడు ప్రజారాజ్యం పార్టీ పేరిట టికెట్లు అమ్ముకున్న మీరా, నీతులు చెప్పేది? అంటూ మోత్కుపల్లి దుయ్యబట్టారు.
Pawan Kalyan
mothkupalli

More Telugu News