Pawan Kalyan: పవన్ కల్యాణ్ బాబాయ్ ప్రసంగం గొప్పగా ఉంది: హీరో రామ్ చరణ్

  • ‘జనసేన’ ఆవిర్భావ దినోత్సవ సభలో బాబాయ్ ప్రసంగం అద్భుతం
  • ‘ఉత్తేజ పరిచేలా, నిజాయతీగా ఉంది
  • భవిష్యత్తులో నైనా రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆశిద్దాం
  • ‘ఫేస్ బుక్’ పోస్ట్ లో రామ్ చరణ్
టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ చంద్రబాబు, లోకేశ్ సహా టీడీపీ నేతలు మండిపడుతున్న తరుణంలో హీరో రామ్ చరణ్ ఓ పోస్ట్ చేశాడు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో తన బాబాయ్ పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చాడు. ‘ఉత్తేజ పరిచేలా, నిజాయతీగా ఉన్న గొప్ప ప్రసంగం!! భవిష్యత్తులోనైనా రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆశిద్దాం..’ అని తన ఫేస్ బుక్ పోస్ట్ లో పేర్కొన్న రామ్ చరణ్,  జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న ఓ ఫొటోను జతపరిచాడు. 

కాగా, ఈ పోస్ట్ పై నెటిజన్లు భిన్న వ్యాఖ్యలు చేశారు. ‘నిజం చెప్పాలంటే మొట్టమొదటసారిగా పీకే హృదయపూర్వకంగా మాట్లాడారు. బాగా అనిపించింది’, ‘నువ్వు సినిమాలపై ఏకాగ్రత పెట్టు. మెగా, పవర్ స్టార్ ల లెగెసీని ముందుకు తీసుకెళ్లు. చరిత్ర సృష్టించేందుకే రాజకీయాలపై పీకే దృష్టి పెట్టారు’ అనే వ్యాఖ్యలతో పాటు పవన్ కల్యాణ్ ని విమర్శిస్తూ మరికొన్ని వ్యాఖ్యలను నెటిజన్లు చేయడం గమనార్హం. 
Pawan Kalyan
Ramcharan

More Telugu News