YSRCP: అవిశ్వాసం పెడితే ఇతర పార్టీల మద్దతు తీసుకొస్తానని పవన్ అన్నారు.. ఇప్పుడెక్కడున్నారు?: వైసీపీ ఎంపీ మేకపాటి

  • రేపు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం
  • సుమిత్రా మహాజన్‌ను నోటీస్ ఇచ్చాం
  • రేపు ఈ అంశంపై చర్చ చేపట్టాలని కోరాం
ప్రత్యేక హోదా కోసం చేసే పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెడితే తాను ఇతర పార్టీల మద్దతు కూడగడతానని చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాము మొదటి నుంచి ఆందోళన చేస్తున్నామని, రేపు తాము పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఈ రోజు తాము స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు నోటీస్ ఇచ్చామని చెప్పారు. రేపు ఈ అంశంపై చర్చ చేపట్టాలని తాము కోరినట్లు చెప్పారు. తమ పార్టీ ఎంపీలు ఇతర పార్టీల మద్దతు కూడగడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పోరాడుతున్నామని తెలిపారు. 
YSRCP
Special Category Status
parliament
Lok Sabha
mekapati

More Telugu News