Telugudesam: తెలుగు జాతి చరిత్రలో చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోతారు : మంత్రి యనమల

షార్ట్స్‌లో చూడండి
తెలుగు జాతి చరిత్రలో నారా చంద్రబాబునాయుడు చిరస్థాయిగా నిలిచిపోతారని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశంసించారు. రాజకీయాల్లోకి చంద్రబాబు అడుగుపెట్టి నలభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన్ని అభినందిస్తూ అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని పలువురు మంత్రులు ఆమోదించారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ, రాజకీయ నాయకుడిగా జీవితం ప్రారంభించిన ఆయన ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉండటం గొప్ప విషయమని, వర్తమాన రాజకీయ జీవితంలో చంద్రబాబు వంటి వ్యక్తులు లేరని ప్రశంసించారు. తెలుగు జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడే వ్యక్తి చంద్రబాబు అని, బడుగు, బలహీన వర్గాల వారి  కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఆయన చేపట్టారని కొనియాడారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు ప్రత్యేక ముద్ర వేశారని, జాతీయ స్థాయిలో కాంగ్రెస్సేతర పార్టీలను ఏకం చేయడంలో నాడు కీలక పాత్రను ఆయన పోషించిన విషయాన్ని యనమల గుర్తుచేసుకున్నారు.
Go Back to Shorts
Telugudesam
Yanamala

More Telugu News