Pawan Kalyan: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చిన నారా లోకేష్

  • తాత, నాన్నలకు చెడ్డ పేరు తీసుకొచ్చే పని చేయను
  • ప్రజల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి చంద్రబాబు
  • యువకులకు ఆయన ఓ రోల్ మోడల్
ఏపీ మంత్రి నారా లోకేష్ అవినీతికి పాల్పడుతున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పవన్ వ్యాఖ్యలపై లోకేష్ స్పందించారు. ఎన్టీఆర్ కు చెడ్డ పేరు తీసుకొస్తున్నారన్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ, తన తాత ఎన్టీఆర్, తండ్రి చంద్రబాబుల మాదిరి తాను మంచి పేరు తీసుకురాకపోయినా... వారికి చెడ్డ పేరు మాత్రం తీసుకురానని అన్నారు. వారి ఆశయాలకు కట్టుబడి ఉంటానని చెప్పారు.

ఎన్ని ఒడిదొడుకులనైనా తట్టుకునే స్థైర్యం చంద్రబాబుకు ఉందని లోకేష్ చెప్పారు. 'వస్తున్నా మీ కోసం' యాత్ర ద్వారా ప్రజా సమస్యలపై పోరాటం చేశారని తెలిపారు. నిరంతరం ప్రజల కోసమే తపిస్తుంటారని... కుటుంబం కోసం కూడా ఏనాడూ ఆలోచించలేదని చెప్పారు. యువకులకు చంద్రబాబు ఓ రోల్ మోడల్ అని అన్నారు. హైదరాబాదులో హైటెక్ సిటీని కట్టిన సమయంలో... రాళ్లురప్పల మధ్య ఈ బిల్డింగ్ ఏంటి అని తాను అనుకున్నానని... దాని ఫలితం ఏంటో ఇప్పుడు అందరికీ తెలుసని చెప్పారు. తాను ఎప్పుడు ఇంటికి వెళ్లినా కనీసం వెయ్యి మంది ఆయన కోసం ఇంటి వద్ద ఉండేవారని తెలిపారు. 
Pawan Kalyan
Chandrababu
Nara Lokesh

More Telugu News