Pawan Kalyan: చిరంజీవి, పవన్ పై విమర్శలు గుప్పించిన మంత్రి నారాయణ

  • ప్రజారాజ్యం పార్టీ స్థాపించి కాపులను తాకట్టు పెట్టిన చిరంజీవి
  • చిరంజీవి కారణంగా కాపు కులస్తులు ఇరవై ఏళ్లు వెనక్కి పోయారు
  • టీడీపీని లక్ష్యంగా చేసుకుని నిన్న పవన్ ప్రసంగించారు
  • జనసేన అధినేతను పావుగా చేసుకున్న బీజేపీ : నారాయణ
చిరంజీవి, పవన్ కల్యాణ్ లపై మంత్రి నారాయణ విమర్శలు గుప్పించారు. నాడు ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి, కాపులను తాకట్టు పెట్టారని, ఆయన వల్ల కాపు కులస్తులు ఇరవై ఏళ్లు వెనక్కి పోయారని విమర్శించారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో టీడీపీపై ఆరోపణలు గుప్పించిన పవన్ కల్యాణ్ పైనా నారాయణ విమర్శలు గుప్పించారు. టీడీపీని లక్ష్యంగా చేసుకుని పవన్ ప్రసంగించారని, టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతిపరులంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని, అవి సినిమా డైలాగ్స్ ని తలపిస్తున్నాయని అన్నారు. టీడీపీ నేత నారా లోకేశ్ చక్కగా, నిజాయతీగా పని చేస్తున్నారని ప్రశంసించిన నారాయణ, జనసేన అధినేతను పావుగా చేసుకుని బీజేపీ వాడుకుంటోందని విమర్శించారు.
Pawan Kalyan

More Telugu News