ntr: రాజమౌళి మల్టీ స్టారర్ కోసమే ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్

  • రాజమౌళి మల్టీ స్టారర్ లో ఎన్టీఆర్ .. చరణ్ 
  • జిమ్ లో కసరత్తులు చేస్తోన్న ఎన్టీఆర్ 
  • వచ్చే మార్చిలో రిలీజ్ చేయాలనే ఆలోచన  
ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ జిమ్ లో వర్కౌట్స్ ఎక్కువగా చేస్తూ వస్తున్నాడు. ఫారిన్ ట్రైనర్ పర్యవేక్షణలో ఆయన కసరత్తులు చేస్తున్నాడు. అయితే అంతా కూడా ఇదంతా త్రివిక్రమ్ సినిమా కోసం అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ ఇంతగా కష్టపడుతున్నది రాజమౌళి మల్టీ స్టారర్ కోసమనే విషయం తాజాగా బయటికి వచ్చింది.

రాజమౌళి సినిమాలో చరణ్ .. ఎన్టీఆర్ లు అన్నదమ్ములుగా కనిపించనున్నారు. పాత్ర పరంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఇది ఈ సినిమాకి మరో అదనపు ఆకర్షణ కానుంది. త్వరలోనే మిగతా నటీనటుల వివరాలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టేసి, వచ్చే మార్చిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.  
ntr
charan
rajamouli

More Telugu News