Chandrababu: మోదీ, బీజేపీలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

  • మోదీపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది
  • యూపీ, బీహార్ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనం
  • పవన్, జగన్ లను అడ్డుపెట్టుకుని ఆటలాడుతోంది
దేశ ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు మోదీపై ఏనాడూ ప్రత్యక్షంగా విమర్శలు చేయని చంద్రబాబు... మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, మోదీని టార్గెట్ చేశారు. దేశంలో మోదీపై, బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని అన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ లలో నిన్న వెల్లడైన ఎన్నికల ఫలితాలే దీనికి తిరుగులేని నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఏపీలో ఏదో చేద్దామనుకుంటున్న బీజేపీ ప్రయత్నాలు ఫలించబోవని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వెనుక బీజేపీ ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. జగన్, పవన్ లను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయించడం... బీజేపీ అసలు నైజాన్ని తెలియజేస్తోందని చెప్పారు. 
Chandrababu
Pawan Kalyan
Jagan
Narendra Modi
BJP

More Telugu News