Kannada: నటుడు కార్తీక్ పై దాడి... తీవ్ర గాయాలు!

షార్ట్స్‌లో చూడండి
గత అర్థరాత్రి కన్నడ హీరో విక్రమ్ కార్తీక్ పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తలకు, చెవులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయమై పోలీసులకు కార్తీక్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభిస్తున్నామని అధికారులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలిస్తున్నామని తెలిపారు. గత రాత్రి శంకర్ మఠ్ సమీపంలో తానున్నవేళ కొంతమంది వచ్చి తనను కారులోనే కొట్టారని, తన మొబైల్ తో పాటు రూ. 50 వేలు దొంగిలించుకు పోయారని తెలిపారు. కేసును సీరియస్ గా తీసుకున్నామని నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా, ప్రస్తుతం కార్తీక్ బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
Go Back to Shorts
Kannada
Karnataka
Vikram Karthik

More Telugu News